కానిస్టేబుల్ భార్య,
తల్లిదండ్రుల వాంగ్మూలం
జానకీపురం ఎన్‌కౌంటర్‌లో
కొత్తకోణం.. తహసీల్దార్
కార్యాలయంలో విచారణ
మోత్కూరు: ఈ నెల 4వ తేదీన నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ నాగరాజు కాల్పులు జరపడం వల్లనే ఓ ఉగ్రవాది హతమైనట్లు మిగిలిన కానిస్టేబుళ్లు తమతో చెప్పారని అతని భార్యతో పాటు తల్లిదండ్రులు వాంగ్మూలమిచ్చారు. జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మహ్మద్ ఎజాజొద్దీన్, మహ్మద్ అస్లామ్‌ఖాన్‌తో పాటు సబ్‌ఇన్‌స్పెక్టర్ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటనపై బుధవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి.కిషన్‌రావు బహిరంగ విచారణ నిర్వహించారు. కానిస్టేబుల్ నాగరాజు భార్య సంజన, ఆయన తండ్రి శ్రీమన్నారాయణ, తల్లి లక్ష్మమ్మలు విచారణకు హాజరయ్యారు.
కాల్చింది నాగరాజే: డీఎస్పీ
జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఆత్మకూరు(ఎం)కు చెందిన కానిస్టేబుల్ నాగరాజు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు మృతిచెందింది వాస్తవమేనని నల్లగొండ డీఎస్పీ బి.రాములు నాయక్ ఆర్డీఓ ఎదుట వాంగ్మూలమిచ్చారు. కాల్పుల్లో మృతిచెందిన ఎస్‌ఐ సిద్ధయ్య వద్ద వున్న రివాల్వర్ తీసుకొని నాగరాజు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారనడానికి రివాల్వర్‌పై నాగరాజు వేలిముద్రలు ఉన్నాయని విచారణ అధికారికి వివరించారు.
నాగరాజు కాల్పులతోనే ఉగ్రవాది హతం
Published Thu, Apr 30 2015 3:44 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement