ఒక్కరి ప్రాణాలు కాపాడటం కోసం నలుగురు.. పదుగురు ఏకమయ్యేవారే మనుషులని నిరూపించిన అద్భుత దృష్యం కామినేని ఆసుపత్రిలో ఆవిష్కృతమైంది.
ఒక్కరి ప్రాణాలు కాపాడటం కోసం నలుగురు.. పదుగురు ఏకమయ్యేవారే మనుషులని నిరూపించిన అద్భుత దృశ్యం కామినేని ఆసుపత్రిలో ఆవిష్కృతమైంది.
శనివారం ఉదయం నల్లగొండ జిల్లా జానకిపురంలో జరిగిన ఎన్కౌంటర్లో దుండగులతో జరిగిన పోరాటంలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్యకు వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తోన్నారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తం అవసరమవుతుందని వైద్యులు చెప్పడమే తరువాయి.. అక్కడే విధులు నిర్వహిస్తోన్న 20 మంది కానిస్టేబుళ్లు సిద్ధయ్యకు రక్తదానం చేశారు. విషమ పరిస్థితి నుంచి బయటపడేది లేనిది ఆపరేషన్ ముగిస్తేగానీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.