టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు లేవు
హైదరాబాద్ : మంత్రివర్గంలో చోటు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన తెలిపారు. ముఖ్యంగా సొంత జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు లేవని, పార్టీలో అందర్నీ సమన్వయం చేసిన తర్వాతే కేబినెట్లో చోటు కల్పించారని ఆయన అన్నారు.
మంత్రి జోగు రామన్నతో కలిసి జిల్ఆ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయన్నారు. సాంకేతికంగా బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నా...పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి తీర్మానం చేసిన తర్వాతే టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన చెప్పారు.