
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్.. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. అప్లై చేసుకోవడానికి ఇంటర్‌నెట్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఫీజు చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment