ఇంటర్మీడియట్ బోర్డులో ఒక అవినీతి అధికారిణి ఏసీబీకి చిక్కింది.
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ బోర్డులో ఒక అవినీతి అధికారిణి ఏసీబీకి చిక్కింది. ఈ సంఘటన గురువారం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇంటర్మీడియట్ బోర్డులో సూపరిండెంట్‌గా పని చేస్తున్న జ్యోతిశ్రీ అనే అధికారిణి రూ. రెండు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
ఇంటర్మీడియట్ నకిలీ మార్కుల పత్రాన్ని ఇచ్చేందుకు ఆమె రెండువేలు లంచం డిమాండ్ చేయగా.. వామన్‌రావు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల వేసి ఆమెను పట్టుకున్నామని అశోక్‌నగర్ ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.