రైతు ఆత్మహత్యలపై జేఏసీ అధ్యయనం
- జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం
నెన్నెల: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై జేఏసీ ఆధ్వర్యంలో అధ్యయనం చేయ నున్నట్లు జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. దేశంలోని రైతు ఆత్మహత్యల్లో తెలంగాణలో 40 శాతం నమోదు కావడం దురదృష్టకరమన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని స్వగ్రామం జోగాపూర్‌కు వచ్చిన సందర్భంగా మాట్లా డుతూ తాము 1998 నుంచి రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. దీనికి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న్డారు.
కరెంటు, సాగునీరు, విత్తనాలు, కనీస మద్దతు ధర, రుణ సౌకర్యం లేక, వాణిజ్య పంటలకు పెట్టుబడి పెట్టి దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారని అన్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఆత్మహత్యలు నివారించవచ్చన్నారు. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో ఓపెన్‌కాస్టుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్నామని, వాటిని ఆపివేయాలని సింగరేణి సీఅండ్‌ఎండీని కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు.