
సాక్షి, భద్రాచలం: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భద్రాద్రిలో కొలువుదీరిన సీతారాముల్ని దర్శించుకున్నారు. శుక్రవారం సతీసమేతంగా భద్రాద్రికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశేషాలు వివరించారు.
దసరా కానుకగా విడుదలైన జై లవకుశ ఘన విజయం సాధించింది. బాల నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ రామాయణం చిత్రంలో నటించారు. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా కుటుంబ సభ్యులతో కలిసి రాములవారి సేవలో పాల్గొన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతాగ్యారేజ్ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment