'మోడీ, సోనియా ప్రభావం ఏమాత్రం లేదు' | Kalvakuntla kavitha takes on bjp, tdp | Sakshi
Sakshi News home page

'మోడీ, సోనియా ప్రభావం ఏమాత్రం లేదు'

Published Sat, Apr 12 2014 10:48 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'మోడీ, సోనియా ప్రభావం ఏమాత్రం లేదు' - Sakshi

'మోడీ, సోనియా ప్రభావం ఏమాత్రం లేదు'

హైదరాబాద్ : తెలంగాణలో నరేంద్ర మోడీ, సోనియా గాంధీ ప్రభావం ఏమాత్రం లేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలకు కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఆమె శనివారమిక్కడ ధీమా వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ ప్రభావం ఏమాత్రం ఉండదని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ దొందు దొందేనని, నాణానికి బొమ్మా బొరుసుల్లాంటివని ఆమె ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదని కవిత విమర్శించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement