కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపచేయాలి : కృష్ణయ్య
ముషీరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపచేయాలని, ఇందుకు గాను ప్రస్తుత బడ్జెట్‌లోరూ.3 వేల కోట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శారదా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర ్భంగా మాట్లాడుతూ పథకాన్ని బీసీలకు వర్తింపజేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీసీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు ప్రధాన భూమిక పోషించారన్నారు. బీసీ మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా అన్యాయం చేశారన్నారు. పథకం వర్తింప చేస్తామని రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పట్టించుకోలేదని, వెంటనే పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శారదగౌడ్, గుజ్జకృష్ణ, లాల్‌కృష్ణ, భద్ర, కుల్కచర్ల శ్రీను, అరుణ్, మారేష్, సత్తి పాల్గొన్నారు.