మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలంలోని ముడుమాల్, కొల్పూర్, మందిపల్లి తదితరనదీతీర ప్రాంతాలను కర్ణాటక పోలీసులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలంలోని ముడుమాల్, కొల్పూర్, మందిపల్లి తదితరనదీతీర ప్రాంతాలను కర్ణాటక పోలీసులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. నదీతీరానికి అటు వైపు(కర్ణాటక) ఉన్న ప్రజలు తమకు, పశువులకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నట్లు, పైన ఉన్న తెలంగాణ రైతులు పొలాల కోసం నదిలో నీటికి అడ్డుకట్టలు వేసుకున్నట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్ణాటకలోని నాయకులు, పోలీసులు వాహనాల్లో వచ్చి నదీతీర ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడారు.
అయితే, కర్నాటక ప్రభుత్వం ఎగువన నదిలో అడ్డుకట్టలు వేసినా మన ప్రాంత అధికారులు పట్టించుకోవడం లేదని, తాము చిన్న, చిన్న కట్టలు వేసి పంటలు కాపాడుకుంటే ఆ రాష్ట్ర పోలీసులు, ప్రజాప్రతినిధులు పర్యటించి హెచ్చరించడం ఏమిటని వారు ప్రశ్నించారు.