కేసీఆర్ రాక 5న
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎం హోదాలో జిల్లాకు ఈ నెల 5న రానున్నారు. సీఎం హోదాలో తొలిసారి రావడంతో ఇటు అధికారులు, పార్టీ వర్గాలు వైభవంగా ఆయనను ఆహ్వానించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో కరీంనగర్‌నే సెంటిమెంట్‌గా భావించే కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అధికారులతో సమీక్ష సమావేశాలను సైతం ఇక్కడి నుంచే ప్రారంభించాలనే కోణంలో జిల్లాకు రానున్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ రోడ ్ల నిర్మాణం కోసం రూ.46 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పైలాన్ ను ప్రారంభించనున్నారు. నగరంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధించిన క్రమంలో కరీంనగర్ నుంచే అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవం ఎంచుకున్న ట్లు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎం పర్యటను విజయవంతం చేయండి : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, ఈద
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కోరారు. జిల్లా కేంద్రం లో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవానికి వస్తున్న అగ్రనేతకు ఘనస్వాగతం పలికేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వస్తున్న కేసీఆర్‌కు జీవితాంతం గుర్తుండేలా గౌరవా న్ని ఇచ్చేందుకు పార్టీ శ్రేణులు ప్రణాళికలు రచిస్తున్నారు.
వేగంగా పైలాన్ పనులు
టవర్‌సర్కిల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు జిల్లా పర్యటన సందర్భంగా ప్రారంభించనున్న తెలంగాణ ఆవిర్భావ చిహ్నం పైలాన్ ఏర్పాటు పనులను కార్పొరేషన్ అధికారులు శరవేగంగా చేపడుతున్నారు. సోమవారం లోగా పైలాన్ పనులను పూర్తిచేసే పనిలో పడ్డారు. శనివారం కార్పొరేషన్ కమిషనర్ కె.రమేశ్ పైలాన్ పనులు పర్యవేక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా పలు అభివృద్ది పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. ప్రతీ రోజు నీటి సరఫరా పనులతోపాటు, లక్ష మొక్కలు నాటే కార్యక్రమం, ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులు, కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు.