అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘గులాబీ’ దళపతి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై మాట్లాడారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ రూరల్ జిల్లా పరకాల సభలకు హాజరైన అనంతరం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో జరిగిన వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల సభలో ప్రసంగించారు. కారు స్పీడ్‌కు ప్రజా కూటమి గాల్లో కొట్టుకుపోతుందన్నారు. కేసీఆర్ ప్రసంగం ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పార్టీ నాయకుల్లో నూతనోత్సాహం నింపింది.
సైడ్‌లైట్స్ :
వరంగల్ అర్బన్ జిల్లాలో..
న్యూశాయంపేట:
- రేలారే.. రేలారే పాటతో ఆకట్టుకున్న మంగ్లీ
- సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరిక
- పదిహేను నిమిషాల్లో ప్రసంగం ముగింపు
- ప్రసంగం ప్రారంభిస్తుండగా మైక్‌సెట్ రబ్బర్ ఊడిపోగా సరిచేసి మాట్లాడారు
- పరకాల నుంచి హన్మకొండ సభకు రోడ్డుమార్గంలో చేరిక
- ఆపద్ధర్మ సీఎం సభా ప్రాంగణానికి రాకముందే వెనుదిరిగిన జనం
- పిల్లాపాపలతో తరలివచ్చిన మహిళలు
- మూడు నియోజకవర్గాల(వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట) నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు
- టీఆర్‌ఎస్ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి ప్రసంగ సమయంలో మార్మోగిన సభా ప్రాంగణం
- మంగ్లీ పాటలు పాడుతుండగా స్టేజీ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో పదేపదే వినయ్‌భాస్కర్ వారించాల్సి వచ్చింది
- సీఎం ప్రసంగంలో చంద్రబాబు పెత్తనం అవసరమా అనడంతో వద్దు,వద్దు అని ప్రజల కేరింతలు
- మూడు కిలోమీటర్ల మేర కాలినడకతో సభాస్థలికి చేరుకున్న కార్యకర్తలు
- సభ ఆలస్యం కావడంతో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటివద్ద సీఎం బస కోసం ఏర్పాట్లు
- కెప్టెన్ ఇంటికి రాకుండానే హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో తిరుగు పయనం
- వరంగల్‌ది 15వ సభ
- అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో ఆర్ట్స్ కళాశాల మైదానం కిక్కిరిసింది
- మైదానం సరిపోకపోవడంతో రోడ్లపైనే కార్యకర్తలు
స్టేషన్ ఘన్‌పూర్‌లో..
స్టేషన్‌ఘన్‌పూర్:
- షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ రావాల్సి ఉంది.
- రెండు గంటల ఆలస్యంగా సాయంత్రం 5గంటల 7 నిమిషాలకు కేసీఆర్ హెలీక్యాప్టర్ సభాప్రాంగణంపై ఒక రౌండ్ తిరిగి హెలీప్యాడ్ వద్దకు 5 గంటల 10 నిమిషాలకు చేరింది.
- ఆర్టీసీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో 5 గంటల 15 నిమిషాలకు సభాస్థలికి చేరుకున్నారు.
- 5 గంటల 18 నిమిషాలకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
- కేవలం ఐదు నిమిషాలే కేసీఆర్ ప్రసంగం సాగింది.
Comments
Please login to add a commentAdd a comment