సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది బీజేపీ అనుకూల ఎజెండా, రహస్య ఎజెండా అని తాము ముందు నుంచీ చెబుతున్నామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్..మళ్లీ మోదీ వద్దకు వెళ్లడాన్ని బట్టి ఈ ఎజెండాను అర్థం చేసుకోవచ్చన్నారు.
కాళేశ్వరంప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానిని కలిశానని కేసీఆర్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని అన్నారు. ఐదేళ్లలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సాధించలేదని మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతోపాటు బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేసీఆర్ తీరు గతంలోనే బయటపడిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment