
పీవీకి కేసీఆర్, గవర్నర్ ఘన నివాళులు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు 93వ జయంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఘనంగా నివాళులు అర్పించారు.
హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు 93వ జయంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఘనంగా నివాళులు అర్పించారు. సంజీవయ్య పార్క్ వద్ద ఉన్న పీవీ ఘాట్ను శనివారం సీఎం కేసీఆర్, గవర్నర్ సందర్శించి అంజలి ఘటించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పీవీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. కాగా పీవీ నరసింహారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు.