
సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేట పండ్ల మార్కెట్‌ను నిరవధికంగా మూసివేశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ మార్కెట్‌లో లావాదేవీలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇక్కడ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, రైతులు భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడం లేదు. గుంపులు గుంపులుగా ఉంటూ పరిశుభత్రను తుంగలో తొక్కుతున్నారు. దీంతో బుధవారం నుంచి మార్కెట్‌ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేషం మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 13వ తేదీ బుధవారం నుంచి మార్కెట్ బంద్ చేస్తున్నామన్నారు. రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment