కుర్చీలను మోస్తున్న విద్యార్థులు
టేక్మాల్(మెదక్): బాలల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం ప్రభుత్వం చట్టాలు చేసినా అవి అమలు కావడం లేదు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సాక్షిగా అది అమలు కావడం లేదనడానికి చక్కని ఉదాహరణ శుక్రవారం టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది.
స్థానిక పోలీస్‌స్టేషన్ భవన ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమానికి మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి కుర్చీలను తీసుకొచ్చారు. కార్యక్రమం అనంతరం కుర్చీలను స్థానిక ఎస్టీ హస్టల్ విద్యార్థులచే మోయించారు. వారు పోలీస్‌స్టేషన్ ప్రహారీని దూకి గోడపై నుంచి కూర్చీలను మోశారు. ఏ చిన్న ప్రమాదం జరిగిన విద్యార్థుల పరిస్థితి అయోమయమే.
సాక్షాత్తు హోంశాఖ మంత్రి నాయిని నర్పిసంహరెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ శివశంకర్, మెదక్ ఎస్పీ చందనాదీప్తి, అదనపు ఎస్పీ నాగరాజు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రవీందర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్న కార్యక్రమంలోనే ఈ విధంగా పనులు చేయించడం గమనార్హం. ఇలా ప్రభుత్వ అధికారులే విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తుంటే బాలకార్మిక వ్యవస్థ దేశంలో ఎప్పటికి అంతమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment