నియామకపు మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయ మూర్తులకు ఆయా కేసుల్లో సహాయ సహకారాలు అందించేందుకు ‘లా క్లర్క్’లను నియమించుకునే విషయంలో మార్గదర్శకాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఫైళ్లను చదివి ఆ కేసు సారాంశాన్ని అందచేయడం, కేసులో జరిగిన పరిణామాలను తేదీల వారీగా పట్టిక తయారు చేయడం, ఆ కేసులో ప్రధానంగా తలెత్తిన ప్రశ్నలను రూపొందించడం,సమావేశాల్లో పాల్గొనే న్యాయమూర్తులకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేసి ఇవ్వడం తదితర పనులను ఈ లా క్లర్క్ లు చేయాల్సి ఉంటుంది. లా క్లర్క్‌ల నియామకాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపడతారు.
లా క్లర్క్‌గా నియమితులయ్యే వ్యక్తి వయస్సు 30 ఏళ్ళు దాటకూడదు. గుర్తింపు పొందిన న్యాయ విశ్వ విద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొంది ఉండాలి. 10+2 తరువాత ఐదేళ్ల విద్యను పూర్తి చేసి ఉండాలి. లా క్లర్క్‌గా పనిచేసే సమయంలో మరే ఇతర కోర్సులో విద్యాభ్యాసం చేయడం గానీ, మరే ఇతర వృత్తిలో కొనసాగడంగానీ చేయరాదు. ఏ బార్ కౌన్సి ల్‌లో కూడా న్యాయవాదిగా నమోదై ఉండకూడదు. హైకోర్టు దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. లా స్కూళ్లు, వర్సిటీలు తమ పూర్వ విద్యార్థులను సిఫారç సు చేయవచ్చు.
సొంత ఖర్చులమీద ఇంటర్వూకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ఎంపిక ప్రతిభ ఆధారంగా జరుగు తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25వేలను గౌరవ వేతనంగా చెల్లిస్తారు. లా క్లర్క్‌గా పని చేసే సమయంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. లా క్లర్క్‌గా రెండేళ్ల గడువు ముగిసిన తరువాత ఏ న్యాయమూర్తి వద్ద లా క్లర్క్‌గా పనిచేశారో, ఆ న్యాయ మూర్తి ముందు న్యాయవాదిగా వాదనలు వినిపించడానికి వీల్లేదు.
హైకోర్టు న్యాయమూర్తులకు ‘లా క్లర్క్‌లు’
Published Fri, Jun 16 2017 2:26 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement