జాతీయ రహదారిపై వాహనంలో సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికులు
సాక్షి, తూప్రాన్ : లాక్‌డాన్ నేపథ్యంలో వలస కార్మికులకు ఇబ్బందులు తప్పడంలేదు. గూడు చేదిరిన పక్షుల్లా.. వారు దిక్కతోచని పరిస్థితుల్లో ఉపాధి కరువై తమ సొంత గూటికి చేరుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. లారీల్లో ప్రమాదం అంచును ప్రయాణం సాగిస్తున్నారు. కనీసం వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వందలు, వేలు కిలోమీటర్ల దూరం లెక్కచేయకుండా తమ పిల్లపాపలతో నడక సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వందల సంఖ్యలో 44వ జాతీయ రహదారిపై నడక సాగిస్తున్నారు. ఈ రహదారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది, దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి తమ సొంత రాష్ట్రాలకు వేళ్లేవారు. ఈ రహదారిగుండనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రారంభించనప్పటి నుంచి నిత్యం వందల సంఖ్యలో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వాహనాల్లో, సైకిళ్లపై బయలుదేరి వెళ్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ..
వలస కార్మికులను ఆదుకునేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రెవెన్యూ అధికారులతో నిత్యం వందల సంఖ్యలో రహదారిగుండా వేళ్తున్న వలస కార్మికులకు కడుపునిండా భోజనం అందిస్తున్నారు. అధికారుల తీసుకుంటున్న చర్యలకు స్థానిక తాము సైతం అంటూ అధికారులకు సహాయం చేస్తున్నారు. దాతల సహాయంతో భోజనాలు అందిస్తున్నారు. ఓ ప్రైవేట్ చెప్పుల పరిశ్రమ నిర్వాహకులు కార్మికులకు చెప్పులను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. నిత్యం కార్మికులకు భోజన వసతులతో పాటు పాదరక్షలను అందిస్తున్నారు. అధికారులను సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment