ప్రియుడి చేతిలో దారుణహత్య
ఓ యువతి ఇష్టపడి ఓ యువకుడిని ప్రేమించింది. అతనితోనే బతకాలనుకుంది. ఈ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలియగా వారు నిరాకరించారు. కొన్నాళ్లకైనా వారిని ఒప్పించి ఇష్టమైన వాడిని పెళ్లాడుదామనుకుంది. యువకుడు మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి పెంచాడు. పెద్దల సమక్షంలో చేసుకుందామని, దొంగచాటు పెళ్లి వద్దని చెప్పినందుకు ప్రేమించిన యువకుడే అతి కిరాతకంగా హత్యచేసిన ఉదంతమిది.
- వీపనగండ్ల
మండల పరిధిలోని బెక్కెం గ్రామం నేలబిల్కుకు చెందిన దేవమ్మ, శాంతయ్యల కుమార్తె వి.నాగమణి (19), అదే గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్‌లు రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆరునెలల క్రితం వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి తల్లిండ్రులకు తెలిసింది. అప్పట్లో ఇద్దరి ఇంట్లో గొడవ జరుగగా ప్రేమికులిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. మల్లేష్ ఐదునెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ టీటీసీ కోచింగ్ తీసకుంటున్నాడు. వారం రోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన యువకుడు నాగమణిని తనతో తీసుకెళ్లేందుకు యత్నించాడు.
ఆమె నిరాకరిస్తూ వచ్చింది. అదే క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయం చూసి యువతి ఇంట్లోకి వెళ్లి తనతో రావాలని పట్టుబట్టాడు. పెద్దల నిర్ణయంతోనే పెళ్లి చేసుకుందామని, వారిని ఒప్పించేవరకు సమమయం పడుతుందని, దొంగచాటు వెళ్లడం తనకు ఇష్టం లేదనితెగేసి చెప్పిం ది. దీంతో ఆవేశానికి లోనైన యువకుడు రుబ్బుడు గుండుతో తలపై అతి దారుణంగా మోది హత్య చేశాడు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వస్తుండగా తప్పించుకొని పారిపోతూ నేనే యువతిని హత్య చేశానని చెప్పాడు. వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి యువతి రక్తపు మడుగులో పడి ఉంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలాంటి వ్యక్తినా అమ్మా.. నీవు ఇష్టపడింది.. చివరికి నీ ప్రాణాలే బలితీసుకున్నాడు కదా.. అని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. యువతికి తల్లిదండ్రులతో పాటు అవ్వ సాయమ్మ, తమ్ముళ్లు కురుముర్తి, శివశంకర్ ఉన్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ వహిద్‌అలిబేగ్, హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్ హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీఐ రాఘవరావు సాయంత్రం బాధితులతో వివరాలు తెలుసుకున్నారు.
ప్రేమించిన పాపానికి..
Published Wed, Dec 17 2014 1:51 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement