ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.
పెద్దపల్లి (కరీంనగర్) : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పి.శ్రీరాములు(40) కారుడ్రైవర్‌గా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఓ కూతురు ఉంది.