నల్గొండ: నల్గొండ జిల్లాలో అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్న ఓ వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలో కిషన్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
నాటు తుపాకి ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఓ నాటు తుపాకి, బుల్లెట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌కుమార్ బీహార్ నుంచి వలస వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.