ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో మావోయిస్టు జిల్లా కమిటీ పేరిట బుధవారం పోస్టర్లు వెలిశాయి. ఇసుక ర్యాంప్‌లో కాంట్రాక్టర్లు ట్రాక్టర్‌లో ఇసుక లోడింగ్ చేసిన కూలీలకు రూ.250 చెల్లించాలని, ట్రాక్టర్‌కు రూ.150 చొప్పున చెల్లించాలని, వీటిపై ఒప్పందం కుదిరిన తర్వాతే ఇసుక అమ్మకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. లేదంటే లారీలు, మిషన్లను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలతో పోస్టర్లు వెలిశాయి.