ఏడ్చారు.. దుమ్మెత్తిపోశారు
కూచున్న చోట నుంచి పట్టుమని పది అడుగులు నడవలేని స్థితిలో ఉన్నవారు..అవసాన దశలో ఆదెరువు లేక దేవుడా అంటూ బతుకులు ఈడుస్తున్న అభాగ్యులు..బతకడానికి వేరే దారిలేక పింఛన్లే ఆసరాగా జీవిస్తున్న వారు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే వారికి జీవనాధారం.. అలాంటి స్థితిలో ఉన్న వారి పేర్లు పింఛన్ జాబితాలో నుంచి తీసేశారు.
దీంతో ఆ అభాగ్యులు షాక్‌కు గురయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వందలాదిమంది పానం కూడగట్టుకొని మహబూబ్ నగర్ కలెక్టరేట్‌కు వచ్చారు. అక్కడ అధికారుల ఎదుట కష్టాలు చెప్పుకొని ఏడ్చారు. చివరకు వారి కడుపు మండింది. ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. దుమ్మెత్తి పోశారు.
మహబూబ్‌నగర్ టౌన్: ‘ఇన్నాళ్లూ వచ్చే కాస్త పింఛన్‌తో మాకు బుక్కెడు బువ్వ దొరికేది. ఇప్పుడు ఆ ఆసరా కూడా లేకుండా చేసినవ్. మాకు అన్నం లేకుండా చేసిన నీకు పుట్టగతులుండవ్..’ అంటూ వృ ద్ధులు, వితంతువులు సీఎం కేసీఆర్‌కు శా పనార్థాలు పెట్టారు. ఏ దిక్కూలే ని మా పింఛన్ తీసేసి నోట్లో మట్టికొడతారా? అ ని మండిపడ్డారు. 65ఏళ్లు నిండి న వారికి మాత్రమే ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద పింఛన్‌ను ఈనెల 8న మంజూరుచేసింది.
దీంతో వయస్సు అర్హత నిబంధనతో చాలామం ది పింఛన్లు కోల్పోయారు. ఈ క్రమంలో సోమవారం వందలాది మంది వృద్ధులు, వికలాంగు లు, వితంతువులు తరలిరావడంతో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వారికి మద్దతుగా పాలకపక్షం, ప్రతిపక్షాల నాయకులు కూడా వే ర్వేరుగా ఆందోళన లు చేపట్టారు. ఇలా ని రసనలు, నిలదీతలతో రెవెన్యూ సమావేశ హాల్‌లో జరుగుతున్న ప్రజావాణి ద ద్దరిల్లింది. నాలుగు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెల కొంది. కొందరు వృద్ధు లు చెప్పులు చూ పుతూ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
తమకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి చెప్పులతోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వీరికి సర్దిచెప్పేందుకు వచ్చిన ఏజేసీ రాజారాం పరిస్థితిని చూసి వెనక్కి వెళ్లిపోతుంటే ఆయన వెనుక నుంచి వారంతా దుమ్మెత్తిపోశారు. ఒకాకనొక దశలో పరి స్థితి చేయిదాటిపోయింది. ఈ సందర్భం గా పలువురు వృద్ధులు మాట్లాడుతూ.. మా దేవుడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యంతో నెలకు వచ్చే పింఛన్‌తో తమకు కాస్త ఆసరా ఉండేదన్నారు. ఏ తోడు లేకపోయినా ప్రతినెలా వచ్చే పింఛన్ పైన ఆధారపడ్డామని, తెలంగాణ రాష్ట్రం అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తమ పింఛన్లు తొలగిస్తావా? అని ధ్వజమెత్తారు. మాలాంటి వాళ్లకు అన్యాయం ఎలా చేయాలనిపించిందని నిలదీశారు.
అఖిలపక్షం నేతల మద్దతు
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మద్దతు పలికారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలమూరు మునిసిపల్ చైర్‌పర్సన్ రాధ కలెక్టరేట్ ఆవరణలో వారితో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల కడుపుకొట్టిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు.
అన్ని అర్హతలు ఉన్నా కావాలనే పింఛన్లను తొలగించారని మండిపడ్డారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ మహబూబ్‌నగర్ పట్టణాధ్యక్షుడు అమరేందర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు ఇచ్చామని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిరాగానే వారి కడుపు కొట్టిందని ధ్వజమెత్తారు.
అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. పింఛన్లను తొలగించడంతో టీఆర్‌ఎస్ నేతలు కూడా ఆందోళన బాట పట్టారు. అర్హత ఉన్న పింఛన్లు రాని కారణంగా తమపై దాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ రాములు, టీడీపీ ఫ్లోర్‌లీడర్ కృష్ణమోహన్, ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ హాదీ, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రసన్న ఆనంద్, జ్యోతి పాల్గొన్నారు.