వివాహిత బలవన్మరణం | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Published Thu, Oct 15 2015 3:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Married woman commits suicide

యాలాల (రంగారెడ్డి జిల్లా) : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని అచ్యుతాపూర్ గ్రామానికి చెందిన గొల్ల కనకయ్య, లక్ష్మి(40) దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

కాగా ఆ కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన లక్ష్మి గురువారం వేకువజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా సమీపంలోనే ఉన్న పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement