జూన్ రెండో తేదీని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
సాక్షి, హైదరాబాద్: జూన్ రెండో తేదీని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక నుంచి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో అమ రుల స్మారకస్థూపాల ఏర్పాటుకు కలెక్టర్లు చర్య లు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై పక్షం రోజుల్లో సీఎస్‌కునివేదికివ్వాలని సూచించింది.
‘వంద కోట్లతో ఓసీ భవన్ నిర్మించాలి’
ఇతర కులాలకు (ఓసీ) చెందిన నిరుపేదల అభి వృద్ధి కోసం హైదరాబాద్‌లో రూ.వంద కోట్లతో ఓసీ భవన్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రకులాలకు చెందినవారు కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ర్టంలో కోటిమందికిపైగా జనాభా గల అగ్రకులాల్లో అత్యధిక శాతం పేదరికంలో ఉన్నార ని పేర్కొన్నారు. అన్నివర్గాలను ఆదుకుంటున్న సీఎం నిరుపేద ఓసీలను కూడా పట్టించుకోవాలని కోరారు.