మొదటి రోజు నామినేషన్లు నిల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్‌లో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. నామినేషన్ల దరఖాస్తుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు విధించారు. 28వ తేదీన నామినేషన్ల పరిశీలన, 30వ తేదీన నామినేషన్ల విత్‌డ్రా ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 16వ తేదీన ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తమ్మీద సెప్టెంబర్ 19వ తేదీలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. ఇదిలా వుంటే నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజైన బుధవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఇన్‌చార్జికి...ఫుల్‌చార్జ్
ఇప్పటివరకు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ఉన్న డా.ఎ.శరత్ ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. దీంతో కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయ బోర్డులను ఇన్‌చార్జ్ అనే పదాన్ని తొలగించి కలెక్టర్‌గా మార్చి కొత్తగా బిగించారు. ఇప్పటివరకు జేసీ ఛాంబర్ నుంచే ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ బుధవారం నుంచి డా.ఎ.శరత్ కలెక్టర్ ఛాంబర్‌లోకి మారారు.
మెదక్ ఉప పోరుకు నోటిఫికేషన్ విడుదల
Published Wed, Aug 20 2014 11:24 PM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM
Advertisement