హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ - బీజేపీ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థినే పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఆయా పార్టీల నేతలు ఆదివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26న బీజేపీ హైకమాండ్ ఆమోదం మేరకు పార్టీ అభ్యర్థిని ప్రకటించనున్నారు. 27న నామినేషన్ కార్యక్రమం ఉన్న విషయం తెలిసిందే. టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకరరావు నివాసంలో ఆదివారం ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న అం శం చర్చకు వచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని కిషన్‌రెడ్డి టీడీపీ నేత లకు స్పష్టం చేశారు.
మెదక్ ఎన్నిక కోసం తమను సమన్వయకమిటీగా పార్టీ నిర్ణయించిందని, బీజేపీ కూడా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని రమణ వారికి సూచించారు. కాగా టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా రెండు పార్టీలు కృషి చేయాలని నిర్ణయించారు. కాగా, మెదక్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి కేటాయించాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.
మెదక్ బరిలో బీజేపీయే!
Published Mon, Aug 25 2014 12:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement