మెదక్ లోక్సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ బలాన్ని తాము నిలబెట్టుకున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు.
మెదక్ లోక్సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ బలాన్ని తాము నిలబెట్టుకున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఆయన ఆ అంశంపై స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు.
''సాయుధ పోరాటంలో పాల్గొన్నవారికి పెన్షన్లు ఆపేస్తారా? మా నిజాం రాజు తరతరాల బూజు అన్న దాశరథి మాటలను కేసీఆర్ ఖండిస్తారా? సెప్టెంబర్ 17ను ఎందుకు గుర్తించడంలేదు?'' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడితో చరిత్రను కాలగర్భంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని చెప్పారు.