ప్రధాని దృష్టికి సింగరేణి కష్టాలు
- నిర్వాసితుల వెతలపై అధ్యయనానికే యాత్ర
- బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి
సాక్షి, భూపాలపల్లి: సింగరేణి సంస్థ విస్తరిం చిన ప్రాంతాల్లో కార్మికులు, నిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, సంక్షేమం, కాంట్రాక్టర్ల శ్రమ దోపిడీ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదిక అందివ్వనున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత గంగాపురం కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ చేపట్టిన సింగరేణి యాత్రలో భాగంగా రెండోరోజైన మంగళవారం భూపాలపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటించారు. సింగరేణి బొగ్గు గనులను సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లా డుతూ పర్యటన తర్వాత సమగ్ర నివేదిక రూపొందించి ప్రధానితోపాటు సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సింగరేణి చీఫ్ సెక్రటరీలకు అందిం చనున్నట్లు పేర్కొన్నారు. కోల్ ఇండియాలో కార్మికులకు అమలు చేస్తున్నట్టుగా వేత నాలు, ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్‌ను సింగరేణి కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అమలు చేసిన విధానాల కారణంగానే సింగరేణిలో కార్మికుల సంఖ్య 1.25 లక్షల నుంచి 56 వేలకు పడిపోయిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఓపెన్‌కాస్ట్ విధానం రద్దు చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ మాట ఎత్తడం లేద ని, తెలంగాణ ఏర్పడినా సింగరేణిలో మార్పు రాలేదని కిషన్‌రెడ్డి అన్నారు.