మేడారం జాతర కమిటీలో ఏకైక ఆదివాసీ...
‘పునరుద్ధరణ’ కూర్పుపై విమర్శలు
ఆదివాసీ వర్గీయుల్లో అసంతృప్తి
వరంగల్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో స్థానికుల పాత్ర ఉండేందుకు ఆలయ కమిటీ ఉంటుంది. కోర్టు వివాదం నేపథ్యంలో ఆలయ కమిటీకి బదులుగా దేవాదాయ శాఖ ఇటీవల ‘సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీ’ని నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీ వేశారు. అరుుతే, పూర్తిగా ఆదివాసీలకు సంబంధించిన ఈ జాతర పునరుద్ధరణ కమిటీలో ఈ వర్గం వారికి ప్రాధాన్యం కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదివాసీల పాత్ర ఎక్కువగా ఉండేలా కమిటీని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం... తొమ్మిది మందిలో ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతర, ఆలయ కమిటీల్లో అధికార పార్టీ నేతలను సభ్యులుగా నియమించడం సహజంగా జరిగే విషయమే. తాజా పుననరుద్ధరణ కమిటీలోనూ ఇదే జరిగింది. ఇలా అధికార పార్టీ నేతలతో నియమించిన కమిటీలో ఆదివాసీలను పట్టించుకోకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మేడారం జాతర ప్రాంతం ఉండే ములుగు నియోజకవర్గం నుంచి ఎ.చందులాల్ గిరిజన మంత్రిగా ఉన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీలో తమ వర్గం వారికి ప్రాధాన్యం కల్పిస్తే సమంజసంగా ఉండేదని ఆదివాసీ సంఘాల నేతలు అంటున్నారు.
‘వన జాతర పునరుద్ధరణ కమిటీలో మా వర్గం వారికి ప్రాధాన్యం ఇవ్వకపోగా అగ్రవర్ణాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆదివాసీల జాతరలో మా పాత్ర ఏమిటో మాకే అర్థం కావడలేదు’ అని మాజీ ప్రజాప్రతినిధి ఒకరు వాపోయా రు. మేడారం జాతర కమిటీ పూర్తిగా ఒకరిద్దరు అధికార పార్టీ ముఖ్య నేతల సొంత వ్యవహారంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఆదివాసీల నేతల వ్యాఖ్యలకు తగినట్లుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తొమ్మిది మంది సభ్యు ల కమిటీలో ఒక్కరే ఆదివాసీ వ్యక్తి ఉన్నారు. మిగిలిన వారిలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కాకుండా ఇతర వర్గం వారు ఉన్నారు. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమ్మక్క-సారలమ్మ జాతర పునరుద్ధరణ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటి పేరు కాక లింగయ్యది. తాడ్వాయి మండలం పడిగాపూర్‌కు చెందిన లిం గయ్య ఆదివాసీ గిరిజనుడు. గతంలో సీపీఐఎంఎల్ ప్రతిఘటన పార్టీలో కీలకంగా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ములుగు నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు. ప్రతి ఘటన పార్టీ కనుమరుగయ్యాక టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గోవిందరావుపేటకు చెందిన ఎస్.సాంబలక్ష్మీ(ఎస్సీ), ఏటూరునాగారానికి చెందిన దడిగెల సమ్మయ్య(నాయూబ్రాహ్మణ), మంగపేటకు చెందిన లొడంగి లింగయ్య(యాదవ)... ఎస్టీల్లో లంబాడి వర్గానికి చెందిన పోరిక కస్నానాయక్(మదనపల్లి), గిరిజన మంత్రి బంధువు అజ్మీరా జవహర్‌లాల్(సారంగాపూర్) సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు వ్యాపారులు సూరపనేని సాయికుమార్, పింగిలి సంపత్‌రెడ్డి, కొంపెల్లి రమణారెడ్డికి కమిటీలో చోటు కల్పించారు.
ఒకే ఒక్కరికి !
Published Tue, Feb 2 2016 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement