అనారోగ్యంతో ఎమ్మెల్యే కుమారుడు మృతి | MIM MLA Jaffar Hussain son Maqsood Hussain passes away | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఎమ్మెల్యే కుమారుడు మృతి

Published Thu, Dec 27 2018 4:40 PM | Last Updated on Thu, Dec 27 2018 4:45 PM

MIM MLA Jaffar Hussain son Maqsood Hussain passes away - Sakshi

సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి ఎమ్మెల్యే, ఎంఐఎం నాయకుడు జాఫర్ హుస్సేన్ మెరాజ్ కుమారుడు మక్సూద్ హుస్సేన్ (34) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మక్సూద్ మృతిచెందారు. 

ఎంబీఏ పూర్తి చేసిన మక్సూద్ హుస్సేన్‌కు మూడేళ్ల కిందటే పెళ్లి అయ్యింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న మక్సూద్ హుస్సేన్‌కు నవంబర్ 23న కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తో ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. అప్పటి నుంచి రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఉదయం మక్సూద్ చనిపోయినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement