
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కీలకమైన రహదారులకు భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో చేపట్టే పలు రహదారుల పనులపై సమీక్షించారు. వాటి నిర్మాణాలకు కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్నిశాఖలు పనులు వేగిరపరుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ కూడా పనుల స్పీడు పెంచింది.