
‘మిషన్ కాకతీయ’ అభాసుపాలు కావద్దు: చాడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ అభాసుపాలవుతోందని, దాన్ని సరిదిద్దే చర్యలను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ విజ్ఞప్తి చేసింది...
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ అభాసుపాలవుతోందని, దాన్ని సరిదిద్దే చర్యలను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ విజ్ఞప్తి చేసింది. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లిలో పర్యటించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి బృందం.. మిషన్ కాకతీయ పనులు సరిగా జరగడం లేదని గుర్తించింది. ఈ మేరకు సీఎంకు పార్టీ కార్యదర్శి చాడ ఓ లేఖ రాశారు. జిల్లాలోని బిజినేపల్లి మండలంలో చేపట్టిన పనులపై విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు, ప్రజలు తీవ్రంగా న ష్టపోయారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిణామాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ముఖ్య మం త్రిని చాడా కోరారు.