తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఎ.జీవన్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు.
సాక్షి, హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎంను కలసి తమ కూ వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు స మాచారం. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 60మంది వేతనాలు పెంచాలని సంతకాలు పెట్టినట్లు సమాచారం.