
సాక్షి, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటివరకు సమర్పించకపోవడంతోనే కాళేశ్వరానికి జాతీయ హోదా దక్కలేదని మండిపడ్డారు. ఎక్కడ లొసుగులు బయటపడతాయేమోనన్న భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆఆర్ హోదా కోసం ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలోనే రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారే తప్ప కేసీఆర్ పెద్దగా చేసిందేమి లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు.