బంజారాహిల్స్ (హైదరాబాద్) : తనకు కొడుకు ప్రేమ కావాలంటూ వృద్ధాప్యంలో ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని శ్రీ వెంకటేశ్వర నగర్‌లో నివసించే లక్ష్మీబాయి అనే మహిళకు ఇద్దరు కుమారులు. ఆరు నెలల క్రితం చిన్న కుమారుడి పెళ్లి జరిగింది.
అయితే ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు రావడంతో... తనపై కుమారుడికి ప్రేమ తగ్గిందందని, అతడి ప్రేమ కావాలంటూ లక్ష్మీబాయి సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె ముందే కుమారుడిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరిని పంపించేశారు. అయినా ఆ తల్లి సంతృప్తి చెందకపోవడం గమనార్హం.
కొడుకు ప్రేమ తగ్గిందంటూ పోలీసులకు ఫిర్యాదు
Published Mon, Jul 20 2015 6:01 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement