హుజూర్‌నగర్ (నల్లగొండ): రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించకుండా పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని 164-1ఎ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చామని తెలిపారు.
అయినప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కోర్టు ధిక్కారంపై తిరిగి హైకోర్టును ఆశ్రయించగా గత నెల 23న ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని రద్దు చేసిందన్నారు. అంతేగాక రాజ్యాంగ విరుద్దంగా రాష్ట్రంలో సలహాదారులు, ప్లానింగ్ బోర్డు సభ్యులు, విప్‌లు, కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రుల హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సభల్లో తన ఉపన్యాసంలో వాడే పదజాలం దారుణంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో కలుపుకున్న కేసీఆర్ సన్నాసులు, దద్దమ్మలైన కాంగ్రెస్ వారితో ఎలాంటి అవసరం ఉందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
'రాజ్యాంగాన్ని గౌరవించని టీఆర్‌ఎస్ ప్రభుత్వం'
Published Sun, Jun 14 2015 4:54 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement