gutha sukhender reddy
-
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందని, దాన్ని కాపాడుకోవాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. సమాచారా న్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందించాలని.. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందు బాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే.. బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు. చదవండి: కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని ప్లాన్! -
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ ప్రక్రియ
-
తెలంగాణ: మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఖాళీ
సాక్షి, నల్లగొండ : ఒకేసారి జిల్లాకు చెందిన ఇద్దరు నేతల పదవీ కాలం.. ఒకేరోజు పూర్తవుతోంది. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై చైర్మన్ పదవిని దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం గురువారంతో పూర్తవుతోంది. వాస్తవానికి మండలిలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతుండగా.. జిల్లాకు చెందిన వారే ఇద్దరున్నారు. ఈ స్థా నాలు ఖాళీ అయ్యేలోపే వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ, కోవిడ్–19 విస్తృత వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పదవీ కాలం పూర్తి కానున్న చైర్మన్ సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లో ఎవరికి ³దవి రెన్యువల్ అవుతుందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. చైర్మన్‌గా... 21 నెలలు నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి 2019 ఆగస్టు 26వ తేదీన ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు వారాల తేడాతో ఆయన అదే ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ శాసన మండలి రెండో చైర్మన్‌గా పీఠం ఎక్కారు. ఈ పదవిలో ఆయన మొత్తంగా ఒక ఏడాది ఎనిమిది నెలల 23రోజులపాటు ఉన్నారు. ఈ సమయంలో రెండు బడ్జెట్ సమావేశాలు, రెండు శీతాకాల సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్సీ రెన్యువల్‌పై అనుచరుల ఆశాభావం గుత్తా ఎమ్మెల్సీగా కనీసం నిండా రెండేళ్లు కూడా పదవిలో లేరు. ఆయనకు చైర్మన్ పదవి కట్టబెట్టినా.. కేవలం 21 నెలలే కావడంతో.. మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశాభావం ఆయన అనుచరవర్గంలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధినేత్రి, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన ఆ పార్టీ ఎంపీలో సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ పార్టీ ఎంపీగా పదవీకాలం పూర్తి కాకముందే ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలోనే కొద్ది ఆలస్యంగానైనా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గుత్తాను మండలిలోకి తీసుకున్నారు. అయితే.. ఎమ్మెల్సీలకు ఉండే ఆరేళ్ల పదవీ కాలంలో గుత్తా కనీసం రెండేళ్లు కూడా ఆ పదవిలో లేని కారణంగా మరోసారి అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో.. తిరిగి ఎన్నికలు జరిగి.. మరోసారి అవకాశం వచ్చేదాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నేతి విద్యాసాగర్‌ది కూడా.. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ 2015 జూన్ 4వ తేదీన ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, ఆయన కూడా గురువారం పదవీకాలం పూర్తి చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ స్వామిగౌడ్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన టీఆర్ఎస్కు సహకరించడంతో స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నేతి విద్యాసాగర్ పదవీ కాలం పూర్తి కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. దీంతో 2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ చైర్మన్‌గా తిరిగి పోస్టు దక్కించుకున్నారు. ► గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదే ఏడాది సెప్టెంబరు 11వ తేదీన చైర్మన్‌గా నియమితులై పదవీ బాధ్యతలు స్వీకరించారు. ► నేతి విద్యాసాగర్ 2015 జూన్ 4న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందే డిప్యూటీ చైర్మన్‌గా పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మరో సారి ఆయ నకు అవకాశం ఇచ్చారు. చైర్మన్‌గా సంతృప్తికరం తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా పనిచేసింది స్వల్ప కాలమే అయినా.. ఆ 21నెలల్లో నాలుగు సెషన్లను ఎంతో సంతృప్తి కలిగించాయి. రెండుసార్లు బడ్జెట్ సమావేశాలు, మరో రెండుసార్లు శీతాకాల సమావేశాలు జరగగా.. మండలి గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేలా.. సభను నిర్వహించిన అనుభూతి గొప్పది. – గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ గౌరవ ప్రదంగా నడిపించా పెద్దల సభను గౌరవ ప్రదంగా నడిపించా. 2012నుంచి తొమ్మిదేళ్లపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సభ్యులందరి సహకారంతో ముందుకు సాగా. సీఎం కేసీఆర్ నాకు ఎమ్మెల్సీగా, డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. – నేతి విద్యాసాగర్, మండలి డిప్యూటీ చైర్మన్ చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం -
కేసీఆర్ ముందు మీ పప్పులు ఉడకవు!
సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో యూరియా కొరత లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తెప్పించాల్సిన కనీస బాధ్యత బీజేపీ నాయకులకు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తూ తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుత్తా మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ ముందు బీజేపీ పప్పులు ఉడకవన్నారు. బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టు పూర్తికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిప్రాదికన ముందుకుపోతోందని ఈ సందర్భంగా తెలిపారు. బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టులో కమీషన్లు పొందిన నీచ చరిత్ర కోమటిరెడ్డిది అని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల్లు తాగిన కోతి అని, తప్పతాగి పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి వ్యాఖ్యాలపై స్పందించాలంటేనే అసహ్యంగా ఉందని విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, విజ్ఞత అవసరమని, అయితే అవి రెండూ కోమటిరెడ్డికి తెలియదని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
నీరూ.. నిప్పు!
సాక్షి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం మొదలైంది. నిధులు ఇవ్వడం లేదని, జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రతిగా.. అసలు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా విడుదల అవుతున్నాయని అధికార పార్టీ నాయకులు ప్రతివిమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్రా జెక్టుల వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు.. ఇలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టారు. అదే మాదిరిగా, నల్లగొండ ఎంపీ, టీ.పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిగా, శాసనమండలి సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఇరువురు ఎంపీల ప్రకటనలపై మండిపడ్డారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయడం లేదని, ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. ఈనెల 26వ తేదీన బ్రాహ్మణవెల్లెంల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ జల సౌధకు చేరుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికోసం ఆయన పోలీసుల అనుమతి కోరనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ పోలీసులు అనుమతిని నిరాకరిస్తే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఇవీ... పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో, రెండోసారి 2018లో ఏర్పాటైన ప్రభుత్వంలో రెండు పర్యాయాలు కూడా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ‘ నీళ్లు–నిధుల–నియామకాలు ’ అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, స్వరాష్ట్రం సిద్ధించాక తమ నినాదాన్ని మరిచిపోయి, జిల్లాలో ప్రాజెక్టులను ఏమ్రాతం పట్టించుకోవడం లేదని, బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోగా.. నిధులూ అంతంత మాత్రంగానే విడుదల చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ సొరంగం పనులు పూర్తయితే.. నేరుగా శ్రీశైలం రిజర్వాయరు నుంచే నీటిని తీసుకోవడం ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు, అక్కడి నుంచి ఎఎమ్మార్పీ కాల్వల ద్వారా ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథానికి నీళ్లు అందుతాయనని చెబుతున్నారు. కానీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఏళ్లుగా కొనసాగుతుండడంపై ఈ ప్రాంత నాయకులు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతోపాటు డిండి ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి , బునాదిగాని కాల్వల పనులు పూర్తికావడం లేదు. దీంతో అనుకున్న మేర రైతులకు సాగునీరు అందడం లేదు. ఈ అంశాలన్నింటిపైనా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే నిధులు : గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో డిండి ప్రాజెక్టు పనులు చేపట్టాం. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ మరో 10.5 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.2,150 కోట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్‌కి కేటాయిం చాం. 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ జయప్రకాష్ అండ్ కంపెనీ ఒప్పం దం చేసుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి రిజర్వాయర్ పూర్తి చేశారు. మరో 11 నెలల్లో సొరంగమార్గం పూర్తి చేసి నీటి విడుదల చేస్తాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ప నులకు రూ.260 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ. రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలోనే యాభై శాతం పనులు పూర్తయ్యాయి. ధనిక రాష్ట్రమని చెబు తున్న సీఎం ఎందుకు బునాదిగాని కాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తదనే భయంతోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. 5వేల మందితో పాదయాత్రగా జలసౌధకు వెళతా. -
‘బొటాబొటి ఓట్లతో గెలిచిన వ్యక్తి... ఎంపీలను గెలిపిస్తాడట’
సాక్షి, నల్గొండ : తెలంగాణ కాంగ్రెస్‌లో అసమర్థ నాయకత్వం ఉందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీపై నమ్మకం లేకనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. చేజారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకొనే దమ్ములేదుగానీ.. ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతున్నారని చురకలంటించారు. శనివారం అటవీ సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, భాస్కరరావుతో కలిసి ఆయన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి ఓట్లతో ఉత్తమ్ బయటపడ్డారు. కోమటిరెడ్డి సోదరులకు మతి భ్రమించింది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నల్గొండ ఎంపీగా అభ్యర్థిగా వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డిని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్యకర్తలు సమష్టిగా పనిచేసి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించాలి. 3 సార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించాను. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కేసీఆర్ కల్పించారు. నన్ను ఎమ్మెల్సీ ప్రకటించినందుకు కేసీఆర్‌కు రుణపడి ఉంటాను’ అని గుత్తా చెప్పారు. నర్సింహ్మారెడ్డి 25న నామినేషన్ దాఖలు చేస్తాడని తెలిపారు. కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ఉత్తమ్ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. -
అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు
► ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిండి : మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2017 చివరి నాటికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తాగు నీరందిస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపన్‌కుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వలన డిండి మండలంలో వానలు కురవక కరువు పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ నేపథ్యంలో మండల ప్రజల ఆకాంక్ష మేరకు కనీసం తాగు నీటి వసతి కోసం కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. వారు వెంటనే స్పందించి సంబంధిత నీటి పారుదల శాఖా మంత్రిహరీశ్‌రావుతో మాట్లాడి అందించిన నీటిని డిండి మండల పరిధిలోని కుంటలకు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల రైతులను సోమవారం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో మొదటగా సింగరాజుపల్లి వద్ద ప్రారంభమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. డిండి ఎత్తిపోతల పథకంలో నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు శాశ్వతంగా తాగు, సాగు నీటి సమస్య లేకుండా పోతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ వీరకారి నాగమ్మ, ఎంపీపీ ముఖ్య సలహాదారుడు రాంకిరణ్, వైస్‌ఎంపీపీ తుమ్మల నీతు, కోఆప్షన్ అల్లాహుద్దిన్, టీఆర్ఎస్ మండల నాయకులు రాజీనేని వెంకటేశ్వరరావు, యదగిరిరావు, బల్ముల తిర్పతయ్య, శ్రీనువాసులు, కృష్ణయ్య, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఓటుకు కోట్లు' కేసు ఏమైంది?
హైదరాబాద్: 'నిన్నటివరకు చంద్రబాబుపై అంతెత్తు ఎగిరిపడ్డారు. ఇవ్వాళేమో అమరావతి శంకుస్థాపనకు వెళతామంటున్నారు. అసలు పిలుపు రాకముందే ఎందుకో అంత ఉత్సాహం!' అంటూ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. చంద్రబాబు నుంచి పిలుపు రాకముందే అమరావతి వెళ్తామంటున్న కేటీఆర్.. ఓటుకు నోట్లు కేసు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. తమ పార్టీ నేతలపై కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉమార్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు తండ్రి కేసీఆర్ జానారెడ్డిని పొగుడుతుంటే, కేటీఆర్ మాత్రం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ తీరు మార్చుకుంటే మంచిదని హితవుపలికారు. మీ ఊళ్లో అడుగుదామా? శనివారం నల్లగొండ జిల్లాలో ఏర్పాటుచేసిన సబలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘అయితే ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ.. ‘నీకేం తెలుసు నా సంగతి.. మీ అయ్యను అడిగితే చెప్తడు’ అని అన్నారు. మా అయ్యనెందుకు? ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఉన్న అయ్యలనడిగితే మీ చరిత్ర, కాంగ్రెస్ నేతల చరిత్ర చెప్తరు..’’ అని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉత్తరకుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేస్తూ.. 'ఈయన కార్లో కాదా ఎన్నికలప్పుడు రూ.3 కోట్లు దొరికింది.. ఎక్కడివి ఆ కట్టలు మర్చిపోయిండా? అలాంటి ఆయన టీఆర్ఎస్ను అవినీతిలో దేశముదురు అంటాడా? మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఉద్యమంలో సింగిల్‌గా ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కేసీఆర్లున్నరు. మాకు ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం ఇస్తే.. మీరు 15 నెలలకే బొబ్బలు పెడ్తరా?’’ అని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. -
'రాజ్యాంగాన్ని గౌరవించని టీఆర్ఎస్ ప్రభుత్వం'
హుజూర్నగర్ (నల్లగొండ): రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించకుండా పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని 164-1ఎ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కోర్టు ధిక్కారంపై తిరిగి హైకోర్టును ఆశ్రయించగా గత నెల 23న ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని రద్దు చేసిందన్నారు. అంతేగాక రాజ్యాంగ విరుద్దంగా రాష్ట్రంలో సలహాదారులు, ప్లానింగ్ బోర్డు సభ్యులు, విప్‌లు, కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రుల హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సభల్లో తన ఉపన్యాసంలో వాడే పదజాలం దారుణంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో కలుపుకున్న కేసీఆర్ సన్నాసులు, దద్దమ్మలైన కాంగ్రెస్ వారితో ఎలాంటి అవసరం ఉందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.