దుమారం
సాక్షి ప్రతినిది, నిజామాబాద్ :నిజామాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు దుమారం రేపుతున్నాయి. చినికి చినికి చివరకు గాలివానగా మారిన ఈ వివాదంపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌వర్గాలు పంపిన నివేదికలు కలకలం సృష్టిస్తున్నా యి. అట్టహాసంగా ప్రారంభించిన అక్రమకట్టడాల కూల్చివేతలను అర్ధంతరంగా ఆపేయడం వెనక లక్షల రూపాయ లు చేతులు మారాయన్న ప్రచారం అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పం దించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అక్రమ క ట్టడాల కూల్చివేతల వెనుక ‘డీల్’పై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. నగర పాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన ఏడాదిలోనే అక్రమ కట్టడాలకు సంబంధిం చి వచ్చిన ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించినట్లు తెలి సింది.
నాలుగైదు రోజుల క్రితం నగర మేయర్ ఆకుల సుజాత, శ్రీశైలం దంపతులను హైదరాబాద్‌కు పిలి పించుకుని మాట్లాడినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అక్రమ కట్టడాల కూల్చివేతలను అర్ధంతరంగా నిలిపివేస్తే ప్రజలకు ఏమని సంకేతాలు ఇచ్చినట్లని ఆమె తీవ్రంగానే మందలించినట్లు సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తే ఎవరికైనా తీవ్ర పరి ణామాలుంటాయని, ఆరోగ్యశాఖలో అక్రమాలు జరిగితే డిప్యూటీ సీఎంను సైతం తప్పించిన సంఘటనను ఆమె ఉదహరించినట్లు తెలిసింది. నగరపాలక సంస్థ పీఠం కోసం చేసిన ఖర్చులను రాబట్టుకోవడ ం పేరిట భారీ వసూళ్లు జరిగాయన్న ప్రచారంపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించినట్టు తెలి సింది. భవిష్యత్‌లో ఇలాంటి ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పిం చేందుకు వెనకాడబోమన్నట్లు తెలిసింది.
అసలు గుట్టుపై ‘ఇంటెలిజెన్స్’ ఆరా
నిజామాబాద్‌లో అక్రమ కట్టడాల గుర్తింపు, కూల్చివేతలు ఆరంభశూరత్వంగా మారాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అక్ర మ నిర్మాణాలపై దృష్టి సారించిన పాలకవర్గం, అధికారులు కొంతకాలం స్పెషల్‌డ్రైవ్ చేశారు. 115 భవనాలను అక్రమంగా నిర్మించారంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఖలీల్‌వాడీలోని ఆస్పత్రుల అక్రమ భవనాలకు కూడా గత అక్టోబర్‌లో నోటీసులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో నవంబర్ 23న అక్రమ కట్టడాల కూల్చివేతలను మొదలెట్టారు. నాలుగైదు రోజులు కూల్చివేతలను ముమ్మరంగా సాగించిన కార్పొరేషన్ అధికారులు ఆ తర్వాత అకస్మాత్తుగా ఆపేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం జరిగింది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ జరిగింది. చివరకు ఈ ముడుపుల భాగోతంపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదిక ను సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గంపై ప్రధానంగా ఈ ఆరోపణలు వచ్చాయి. మేయర్ ఎంపికను చివరివరకు సస్పెన్స్‌లో పెట్టిన టీఆర్‌ఎస్ ఆ ఖరు నిముషంలో అనూహ్యంగా ఆకుల సుజాత పేరును ప్రకటించింది. వీరి ఎంపికకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ప్రజాప్రతినిధులపైనా ‘ముడుపుల’ ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కవిత సీరియస్‌గా స్పందించారని తెలుస్తోంది.
అన్నీ అక్రమ నిర్మాణాలే
నగరపాలక సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే గ్రూప్-1 అధికారి వాసం వెంకటేశ్వర్లును కమిషనర్‌గా నియమించింది. ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రయత్నించినా, కొరత కారణంగా నిజాయితీ గల అధికారిగా పేరున్న వెం కటేశ్వర్లును నియమిం చారు. వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాం తాలలో నిక్కచ్చిగా పని చేసిన పేరున్న ఆయన విధులలో చేరిన మరు క్షణం నుంచే నగరంలో ని పలు ప్రాంతాలలో పర్యటించారు. పాలనను గాడిలో పెట్టడంపై ఆయన దృష్టి సారించారు. ఖలీల్‌వాడీ, వినాయక్‌నగర్, గంగాస్థాన్ ప్రాంతాలలో అపార్టుమెంట్లు, నూతన కట్టడాల జోరు పెరిగింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మించ డం వంటి కొనసాగాయి. గత అక్టోబర్‌లో వినాయక్‌నగర్‌లోని అశోక అపార్టుమెంట్‌లో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.
అధికారులు దానిని సీజ్ చేసినా, తిరిగి నాలుగు రోజుల తరువాత నిర్మాణ పనులు కొనసాగాయి. నగరంలో సెల్లార్లు లేకుండా నిర్మాణాలు వెలిసాయి. వినాయకనగర్‌లోని ఓ టీవీ షోరూం భవనానికి సెల్లార్ కూడా వ్యాపార సముదాయంగా మారింది. బస్టాండ్ వద్ద ఓ కాంప్లెక్స్‌కు సెల్లార్‌లో సైతం వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బస్వా గార్డెన్ సమీపంలో మూడు అపార్టుమెంట్లు, గంగాస్థాన్ , వినాయక్‌నగర్ ప్రాంతంలో విచ్చలవిడిగా అపార్టమెంట్లు పెరిగిపోతు న్నాయి. ఇలా అనేక చోట్ల నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై ఇప్పటికైనా నగరపాలక సంస్థ స్పందించాలని పలువురు కోరుతున్నారు.