పూర్తయితే డిగ్రీ.. మానేస్తే డిప్లొమా!  | Multiple Entry And Exit Method In Degree Courses | Sakshi
Sakshi News home page

పూర్తయితే డిగ్రీ.. మానేస్తే డిప్లొమా! 

Published Sat, Feb 1 2020 3:16 AM | Last Updated on Sat, Feb 1 2020 10:29 AM

Multiple Entry And Exit Method In Degree Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీలో ఎప్పుడంటే అప్పుడు ఆగిపోవచ్చు. మధ్యలో మరేదైనా కోర్సు చేసి వచ్చి మళ్లీ పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదో, రెండేళ్లో చదివి పాసైన సబ్జెక్టుల క్రెడిట్లను దాచుకోవచ్చు. ఇలా మధ్యలో చదువు ఆపేసినా చదివిన చదువుకు సర్టిఫికెట్లు ఇచ్చేలా నూతన విద్యా విధా నం (ఎన్‌ఈపీ) కీలక సిఫార్సు చేసింది. డిగ్రీ విద్యా విధానంలో సమూల మార్పులకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మలి్టపుల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ విధానాన్ని తీసుకురావాలని న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ ఫైనల్‌ డ్రాఫ్ట్‌లో కస్తూరి రంగన్‌ కమిటీ పేర్కొంది. డిగ్రీ చదివే విద్యార్థులు ఆ కోర్సును పూర్తి చేస్తే డిగ్రీ పట్టా, ఏడాది తర్వాత మానేస్తే డిప్లొమా, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక మానేస్తే అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా సర్టిఫికెట్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

కేంద్రం అంగీకరిస్తే డిగ్రీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పోటీని ఎదుర్కునే సత్తా పెంపొందించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా నూతన విద్యా విధానంలో పలు కీలక అంశాలను పొందుపరిచారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ విద్యా విధానాన్ని సమగ్రంగా పరిశీలించిన పాలసీ కమిటీ అన్ని స్థాయిల్లో హ్యుమానిటీస్, ఆర్ట్స్‌ జొప్పించడంతోపాటు అభ్యసన సామర్థ్యాల పెంపు, క్రియేటివిటీ, ఇన్నొవేషన్స్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లం సాలి్వంగ్‌ ఎబిలిటీ, టీమ్‌ వర్క్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, లైఫ్‌ స్కిల్స్‌ పెంపొందించే విద్యా విధానం తీసుకురావాలని, స్థానిక పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్‌íÙప్‌ విధానం అమలు చేయాలని పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థుల్లో పరిశోధన, విద్యా సామర్థ్యాలు పెరిగి స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపింది. ఐఐటీల తరహాలో ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు కూడా ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ను ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థులు తమకు నచ్చిన, ఉపాధి అవకాశాలు పొందేందుకు కావాల్సిన కోర్సులు, సబ్జెక్టులను మాత్రమే చదువుకునే విధానాన్ని అందుబాటులోకి (ఫ్లెక్సిబుల్‌ కరిక్యులమ్‌) తేవాలని పేర్కొంది.

ఎప్పుడంటే అప్పుడు.. 
విద్యార్థులు ప్రస్తుతం డిగ్రీలో చేరిన రెండేళ్ల తర్వాత మరో కోర్సు చేయాలంటే ఈ రెండేళ్ల చదువును వదులుకోవాల్సిందే. కానీ ఇకపై అలాంటి విధానాన్ని తొలగించాలని, ఆ రెండేళ్లను చదువును కూడా పరిగణనలోకి తీసుకునేలా, అవసరమైతే తర్వాత ఎప్పుడంటే అప్పుడు కొనసాగించే అవకాశాలను తీసుకురావాలని వెల్లడించింది. చదుకున్న చదువుకు తగిన సరి్టఫికెట్లు ఇవ్వాలని పేర్కొంది. ఇందులో భాగంగా మలి్టపుల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ విధానం తేవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు మూడేళ్లు, ఇంజనీరింగ్‌ వంటి డిగ్రీలు నాలుగేళ్లు ఉన్నాయి. డిగ్రీ మూడేళ్లు, నాలుగేళ్లు ఉన్నా.. వాటిని చదువుతూ మధ్యలో ఆపినవారికి తగిన సరి్టఫికెట్లు ఇవ్వాల్సిందేనని పేర్కొంది. డిగ్రీలో చేరిన విద్యారి్థకి మొదటి ఏడాది పూర్తయితే డిప్లొమా సరి్టఫికెట్, రెండేళ్లు పూర్తయితే అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా సరి్టఫికెట్, మూడేళ్లు పూర్తయితే డిగ్రీ సరి్టఫికెట్‌ ఇవ్వాలని పేర్కొంది. అదే నాలుగేళ్ల డిగ్రీ చేస్తే పరిశోధన డిగ్రీగా పరిగణించాలని పేర్కొంది. రెగ్యులర్‌ కోర్సులతోపాటు వొకేషనల్, ప్రొఫెషనల్‌ కోర్సుల్లోనూ దీనిని అమలు చేయాలని తెలిపింది.

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. 
విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకునే విద్యా విధానం డిగ్రీలో ఉండాలని పేర్కొంది. ఇందుకోసం అకడమిక్‌ బ్యాంక్‌ క్రెడిట్స్‌ను (ఏబీసీ) ఏర్పాటు చేయాలని వెల్లడించింది. తద్వారా విద్యార్థి ఒక రాష్ట్రంలో లేదా ఒక యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసి, మరో రాష్ట్రంలో లేదా మరో యూనివర్సిటీలో చదువుకునేలా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అయితే ముందుగా చదివిన క్రెడిట్లు నష్టపోకుండా, వాటిని పరిగణనలోకి తీసుకొని డిప్లొమా లేదా డిగ్రీ సరి్టఫికెట్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఏబీసీని ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ఇదీ రెగ్యులర్‌ విద్యార్థులకే కాకుండా ఫెయిలైన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇందులో విద్యార్థి తను పాసైన సబ్జెక్టుల క్రెడిట్లను దాచుకోవచ్చు.

మిగతా సబ్జెక్టులను అక్కడే చదివినా, ఇతర యూనివర్సిటీల్లో చదివినా వాటికి క్రెడిట్లు ఇవ్వాలి. ఇలా ఒక డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, డిగ్రీకి అవసరమైన నిరీ్ణత క్రెడిట్లను ఆ విద్యార్థి సాధించగానే అతనికి సంబంధిత సరి్టఫికెట్‌ను అందించే విధానం తేవాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు నచి్చన సబ్జెక్టులను ఇష్టపూర్వకంగా చదువుకోవడంతోపాటు అందులో నిష్ణాతులు అవుతారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించింది.

 పీజీ రెండో ఏడాదంతా పరిశోధనే.. 
మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో (పీజీ) మొదటి ఏడాది చదువుకుంటే రెండో ఏడాదంతా పరిశోధనపైనే ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అదే నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ చేసిన వారు ఒక్క ఏడాదే పీజీ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. వారు పరిశోధన డిగ్రీని నాలుగేళ్లు చదివినందున, ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని వెల్లడించింది. ఇక పీహెచ్‌డీలో ప్రవేశాలకు మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్లు పీజీ చేసిన వారు, నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎంఫిల్‌ కోర్సును రద్దు చేయాలని పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement