‘నీలగిరి’ అక్రమాలపై సీబీ‘ఐ’ | Municipal office Corruption | Sakshi
Sakshi News home page

‘నీలగిరి’ అక్రమాలపై సీబీ‘ఐ’

Published Wed, Apr 22 2015 12:36 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

Municipal office Corruption

 నల్లగొండ మున్సిపాలిటీలో రశీదు బుక్కులు మాయం చేసి కోట్లాది రూపాయలను నొక్కేసిన ఉద్యోగుల భరతం పట్టేందుకు రంగం సిద్ధమైంది. 2009 నుంచి రశీదు బుక్కులు ఏ విధంగా మాయమయ్యాయి..దీనికి కారకులు ఎవరూ.. ఎంతమంది ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది..అక్రమాలు బయటపడినా సదరు ఉద్యోగులపై చర్య తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటీ..? తదితర అంశాలన్నీ త్వరలోనే నిగ్గుతేలనున్నాయి. చైర్‌పర్సన్ సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలియడంతో ఇప్పటికే అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైనట్టు తెలిసింది.
 
 ముక్కుపిండి మరీ.. దోపిడీ
 మున్సిపాలిటీలో ఉద్యోగాలు పొంది ఇక్కడే దీర్ఘకాలంగా సీట్లకు అతుక్కుపోయిన కొందరుమ ఉద్యోగులు తమ అక్రమాల ఆగడాలు శృతిమించిపోయాయనే వాదనలు ఉన్నాయి. పట్టణంలో వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుంచి వారు ముక్కుపిండి ముడుపులు తీసుకుంటున్న విషయాలు జగమెరిగిన సత్యమేనని పలువురు చెవులు కొరుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఒక పని చేస్తే కింది నుంచి పై స్థాయి వారి వరకు తలా కొంత ఇచ్చుకుంటే తమకు మిగిలేది ఏముందిలో కొద్దో గొప్పో అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఈ ఘనులు భారీ అక్రమాలకు తెరలేపారు. తాము దిగమింగిన కోట్ల రూపాయల నగదును ఇతరుల కంటపడకుండా గూడుపుఠాణి నడిపించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.15 కోట్ల స్వాహా కార్యంలో ఇన్‌చార్జి కమిషనర్లు, ఒకరిద్దరు రె గ్యులర్ కమిషనర్ల హస్తం సైతం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అక్రమార్కులకు వీరి అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్ల పాటు అక్రమంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టగలిగారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
 
 అత్యాషే.. కొంపముంచిందా..?
 మున్సిపల్ కార్యాలయంలో అవినీతికి అంతే లేకుండా పోయిందని ప్రజలు ఉద్యోగులతో గొడవకు దిగిన ఘటనలు ఉన్నాయి. ప్రతి పనికి వ్యక్తిని బట్టి, పనిని బట్టి అందినకాడికి డబ్బులు దండుకున్నారనే విమర్శలు లేకపోలే దు. పైసా ఇవ్వనిదే పనిచేయని కొంత మంది ఉద్యోగులు హైటెక్ దోపిడీకి వ్యూహం రచించి అడ్డంగా దొరికిపోయారు. పర్సేంటేజీలు తీసుకుంటే లక్షలు మాత్రమే సంపాదిస్తాం ...అడ్డదారిలో వెళితే కోట్లు గడించవచ్చు అనుకున్న ఆ ఉద్యోగుల అత్యాషే ఇప్పుడు బెడిసికొట్టింది. మున్సిపాలిటీకి వివిధ రకాలుగా పన్నుల రూపంలో వచ్చే డబ్బును స్వాహా చేశారు. ఇప్పుడు అవినీతి కుంభకోణంలో తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ మున్సిపాలిటీ పేరు మార్మోగుతుండడం గమనార్హం.
 
 ‘సాక్షి’ కథనాలు జోడించి..
 మున్సిపల్ కార్యాలయంలో 2009 నుంచి ఇప్పటి వరకు  రశీదు బుక్కులు, రికార్డులు మాయం చేసి కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంపై మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీని వాస్ మంగళవారం ఫ్యాక్స్ ద్వారా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో అక్రమాల వివరాలు, సాక్షిలో వచ్చిన  వరుస కథనాలు జోడించి ఫిర్యాదు చేశారు. అదే విధంగా డీ ఎంఏ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. నల్లగొండలో జరిగిన రశీదు బుక్కుల మా యం, కోట్ల రూపాయల దోపిడీపై సాక్షిలో కథనాలు రావడంతో వీటిని ఆధారంగా చేసుకుని 2009 నుంచి రాష్ట్రం లోని అన్ని మున్సిపాలిటీలలో సెంట్రల్ ఆడిట్ బృందంతో ఆడి ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిన ట్లు తెలిసింది. సెంట్రల్ ఆడిట్ జరిగితే ఇక్కడి మున్సిపాలిటిలో దాదాపు 20 మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement