
సాక్షి, న్యూఢిల్లీ : నీటి యాజమాన్య పద్ధతులు, జల సంరక్షణ, నీటి వినియోగంలో ఉత్తమ విధానాల అమలుకుగానూ జాతీయ జల్ మిషన్ ప్రదానం చేసే అవార్డుల్లో తెలంగాణకు 3 అవార్డులు దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వల్ల తాగు నీటి సామర్థ్యం 20% పెంపుదల విభాగంలో మొదటి బహుమతి కింద రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి అందుకున్నారు. జలవనరుల సమాచారం, నిర్వహణ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నడిచే తెలం గాణ వాటర్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం రెండో స్థానంలో నిలవగా ఆ అవార్డును రాష్ట్ర సాగు నీటి శాఖ తరఫున సీఏడీఏ కమిషనర్ మల్సూర్ అందుకున్నారు. ప్రమాదకర స్థితికి చేరిన భూగర్భ జలాల పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలకుగాను రాష్ట్ర భూగర్భ జల విభా గం 3వ స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment