సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ‘ఇందిర జలప్రభ’ పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది పథకం పరిస్థితి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు నిధులతో ఈ పథకంలో పనులు చేపడతా రు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సుమారు 7,868 మంది రైతుల భూములకు మొదటి విడతగా సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఉ పాధిహామీ, నాబార్డు నుంచి రూ.15.95 కోట్ల నిధు లు కేటాయించారు. అయితే పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 3,724 ఎస్‌సీ, 4,144 ఎస్‌టీ కుటుంబాలకు చెందిన భూములను అభివృద్ధి చేసే ఈ పథకంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2,734 బ్లాకులు ఎంపిక
ఇందిర జలప్రభ కింద ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు చెంది న బంజరు,అసైన్డ్ భూములను అభివృద్ధి చేసేం దుకు అధికారులు ఆరు క్లస్టర్లు ఏర్పాటుచేసి 2,734 బ్లాకులు గుర్తించారు. ఈ బ్లాకుల పరిధిలో సుమారుగా 18,326.31 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించింది. 1,577 బోర్లను వేసేందుకు ప్రతిపాదించగా, 1,326 బోర్లకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు అధికారులు 2011 నవంబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించారు.
బోర్‌వెల్(డీటీహెచ్) కోసం మీటరుకు రూ.230 చొప్పున 90 మీటర్ల వరకు, ట్యూబ్‌వెల్ కన్‌స్ట్రక్షన్ (రోటరీ)కు మీటర్‌కు రూ.820లు చెల్లించేందుకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. 18,326.31 ఎకరాలలో భూగర్భజలాల గుర్తింపు సర్వే పూర్తిచేసిన అధికారులు, 1,326 బోర్లను వేసేందుకు అర్హత గల బోర్‌వెల్ సంస్థలకు అప్పగిం చారు. జిల్లాలో ఇప్పటి వరకు నాబార్డు, ఈజీఎస్‌ల కింద 351 బోర్లు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.186 బోర్ల కింద తక్షణమే ఎస్‌సీ, ఎస్‌టీ భూములు సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా, కేవలం 86 బోరుబావులకు మాత్రమే విద్యుత్ కనెక్షన్షపై ఎన్‌పీడీసీఎల్ స్పష్టత ఇచ్చింది. బోర్లు వేసి మోటార్లు బిగించినా, విద్యుత్ స్తంభాలు, వైర్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు లేవంటూ చేతులెత్తేయడంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పంపుసెట్ల కొనుగోలు టెండర్లపై స్పష్టత కరువు
బోర్‌వెల్స్ కోసం 2011, నవంబర్ 19, 26 తేదీలలో రెండు పర్యాయాలు టెండర్లు నిర్వహించారు. అగ్రిమెంట్ పూర్తయ్యేసరికి రెండు మాసాలు పట్టింది. 18,326.31 ఎకరాలలో బోర్లు వేసేందుకు భూగర్భజల పరీక్షల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడగా, డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక నియామకాలు చేశారు. 1,326 బోర్లు వేసేందుకు సర్వే పూర్తయినా, 351 బోర్లు మాత్రమే ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా వేయగలిగారు. తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులకు సిఫారసు చేయగా, కేవలం 86 కనెక్షన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.
విద్యుత్ శాఖ నుంచి అవాంతరాలు తప్పడ ం లేదు. సబ్ మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్లు, ఇన్స్‌లేషన్, పీవీసీ పైపులు, మినీ ప్యానెల్ బోర్డు తదితర సామగ్రి కోసం రెండు పర్యాయాలు నిర్వహించిన టెండర్లు కొలిక్కి వచ్చినా రైతులకు స్పష్టత లేదు. ఐఎస్‌ఐ-9283, ఐఎస్‌ఐ-8034 గుర్తింపు పొందిన మోటార్లు, పంపుసెట్లు తదితర సామగ్రిని సరఫరా చేసేందుకు అర్హత గల కాంట్రాక్టర్లను ఎంపిక చేశామని చెబుతున్నా,రైతులకు చేరిన మోటార్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బావులు, పర్క్యులేషన్ ట్యాంకులు,లిఫ్ట్ ఇరిగేషన్ వంటి పనులు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం ఇకనైనా దృష్టిసారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇందిర జలభ్రమ
Published Fri, May 23 2014 2:59 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement