నిమ్స్‌లో జూడాల ఆందోళన | NIMS Hospital Junior Doctors Protest Against Attacks | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో జూడాల ఆందోళన

Published Wed, May 30 2018 7:31 AM | Last Updated on Wed, May 30 2018 7:50 AM

NIMS Hospital Junior Doctors Protest Against Attacks - Sakshi

జూనియర్‌ డాక్టర్‌పై దాడికి యత్నిస్తున్న బాధితురాలి బంధువులు

హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆసుపత్రిలో అర్ధరాత్రి అలజడి చెలరేగింది. మంగళవారం అర్ధరాత్రి జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. ఓ రోగి మృతిచెందడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై బాధితురాలి బందువులు దాడికి దిగారు. దీంతో జూనియర్‌ డాక్టర్లు విధులను బహిష్కరించి, ఆందోళనకు దిగారు. మేడిపల్లికి చెందిన అరుణ మల్టిపుల్‌ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్స్‌తో ఈ నెల 19న నిమ్స్‌లో చేరారు. వైద్యులు అమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అరుణ పరిస్థితి విషమించడంతో డాక్టర్‌ ఇర్ఫాన్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన అరుణ బంధువులు ఇర్ఫాన్‌తో వాగ్వాదానికి దిగారు. అమె మరణించిందని చెప్పడంతో ఆయనను పరిగెత్తించి కొట్టారని జూడాలు పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, అరెస్ట్‌ చేసి విడిచిపెట్టారని జూడాలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement