
విభజన ఫైళ్లు తప్ప మరేవీ వద్దు
రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైళ్లు తప్ప ఇతర ఫైళ్లు ఏవీ తనకు పంపించవద్దని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టంచేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైళ్లు తప్ప ఇతర ఫైళ్లు ఏవీ తనకు పంపించవద్దని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత విధానపరమైన, కీలకమైన ఫైళ్లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించాలని అందులో సూచించారు. గవర్నర్ నుంచి వచ్చిన లేఖను ఆయన సలహాదారులు సలావుద్దీన్, ఏఎన్ రాయ్‌లకు సీఎస్ పంపించారు.