జోగిపేట, న్యూస్‌లైన్: ఈ ఏడాది రబీ పంట కాలం దాదాపు ముగిసింది. ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయశాఖ చేపట్టాల్సిన రైతు చైతన్య యాత్రలు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలను ముందుగా గుర్తించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వ రకు ఎన్నికల్లో నిమగ్నమైన యంత్రాంగం శాఖాపరమైన కార్యక్రమాలను పక్కన బెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేది అనుమానమేనని సం బంధిత అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముం దు రైతు చైతన్య యాత్రలు నిర్వహించాలని ఉ న్నతాధికారుల నుంచి ఆయా డివిజన్ మ ండల అధికారులకు సమాచారం వచ్చింది. అయితే ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.
అధికారులకు అందని ఆదేశాలు
వ్యవసాయ అనుబంధ శాఖలపై రైతులకు అవగాహన కల్పించి సమాయత్తం చేయడానికి జి ల్లా యంత్రాంగం ఏటా ఏప్రిల్ చివరి వారం ను ంచి మే మొదటి వారం వరకు రైతు చైతన్య యా త్రలు నిర్వహిస్తూ వచ్చేది. ఖరీఫ్‌లో సూచనలకు గాను క్షేత్ర స్థాయిలో గ్రామాలకు వెళ్లి అన్నదాతలకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పిం చి వారిలో చైతన్యం తీసుకురావాలన్నది ఈ యాత్రల ఉద్దేశం. గత ఏడాది విత్తనాలు, ఎరువుల కోసం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రో జుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు, తొక్కిసలాటలు జరిగిన సందర్భాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతు చైతన్య యా త్రల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నా యి. గత సంవత్సరం ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు రైతు చైతన్య యాత్రలను నిర్వహించారు.
యాత్రల ఉద్దేశo
రైతు చైతన్య యాత్రల్లో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా అనుబంధ శాఖల్లో అమలు చే స్తున్న కార్యక్రమాలు, భూసార పరీక్షలు, శ్రీవరి సాగు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందు లు కొనుగోలులో జాగ్రత్తలు, విత్తన శుద్ధి తది తర కార్యక్రమాలపై రైతులను చైతన్య పరచాల్సి ఉంటుంది. పశుసంవర్థక శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్య్స, సాగునీటి, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మార్కెటింగ్, ట్రాన్స్‌కో, బ్యాంకు లు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు రైతు చైతన్య యాత్రల్లో పాల్గొని అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను వివరిస్తారు. ఆయా శాఖల అధికారులు వివిధ అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులను పంటల సాగు గురించి చైతన్య పరుస్తారు. పంట రుణాలు, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇస్తున్న రాయితీ ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పిస్తారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అధునాతన పరిజ్ఞానం అందించే పొలంబడి, విత్తనోత్పత్తి, వర్మీకంపోస్టు, భూసార పరీక్షల గురించి వివరిస్తారు. దీంతో రైతులు ఆధునిక మెలకువలు నేర్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
రైతు చైతన్య యాత్రలేవీ?
Published Sun, May 11 2014 11:07 PM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement