త్వరలో 15వేల కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోందని, అందులో భాగంగానే 9వేల పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
గజ్వేల్(మెదక్) : త్వరలో 15వేల కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోందని, అందులో భాగంగానే 9వేల పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గజ్వేల్‌లోని దొంతుల ప్రసాద్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి, విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. 900ల ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ త్వరలో రానుందని స్పష్టం చేశారు. మునుపెన్నడూలేని విధంగా ఈ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.