మెదక్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్ ఏర్పాటు, మినీట్యాంకు బండ్ నిర్మాణం, రూ.50కోట్లతో పట్టణానికి మిషన్ భగీరథ పథకం అమలుతో మెదక్ దశ తిరిగినట్లేనని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ పనులకు ఆయన మెదక్ మండలం పాతూర్‌లో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ పూర్తి చేసి, పరిహారంలో సగం భరించిందని తెలిపారు. రెండేళ్లలో రైల్వేలైన్ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మెదక్ దశ తిరిగినట్లే: మంత్రి హరీశ్ రావు
Published Sat, Jul 16 2016 3:41 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement