మీ ఇంటికొస్తున్నం
ఇవి ఉంటే మేలు...
ఆహారభద్రతకు వచ్చిన సర్వే వివరాలను సరిపోల్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. కాబట్టి ఇందుకు ప్రత్యేకంగా ధ్రువపత్రాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
వికలాంగులయితే పింఛన్‌కు సంబంధించిన సదరమ్ సర్టిఫికెట్ ఉండాలి.
వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు భర్తమరణ ధ్రువీకరణ పత్రం చూపించాలి. లేని పక్షంలో వైద్య పత్రాలు తాత్కాలికంగా ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. లేదంటే పక్కంటివారు, లేదా కుల పెద్దల అనుమతితో వాటిని ఆమోదిస్తారు.
వృద్ధాప్య పింఛన్ల కోసం వయస్సు ధ్రువీక రణకు సంబంధించి ఆధార్, ఓటరు కార్డు ఇలా ఏదైనా ఓకార్డు చూపిస్తే సరిపోతుంది.
సదరమ్, మరణ ధ్రువీకరణ పత్రాలు లేనిపక్షంలో పక్కంటి వారిని అడిగి నిజాలు నిర్ధారించుకుంటారు.
కల్లుగీతకార్మికులు, చేనేత పింఛన్‌దారులు సొసైటీ గుర్తింపు కార్డులు చూపించాలి.
నీలగిరి : జిల్లాలో ఆహారభద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయిలో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల్లో శిక్షణ తీసుకున్న 427 మంది విచారణాధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలు ఇచ్చిన సమాచారం సరైందా? కాదా? అనే విషయాలను తేల్చనున్నారు. పింఛన్లకు సంబంధించి నవంబర్ 2 వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి. తదనంతరం అర్హుల జాబితాను రూపొందించి ప్ర భుత్వానికి అందజేస్తారు. కొత్త పిం ఛన్లు నవంబర్‌లో పంపిణీ చేస్తారు. ఆహార భద్రత కార్డులకు భారీ సం ఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యం లో , పరిశీలన నవంబర్‌నెలలో పూర్తి చేసి, డిసెంబర్‌లో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. మంగళవారం నుంచి నిర్వహించే ఇంటింటి సర్వేలో మాత్రం ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు కలి పి ఒకేసారి విచారణ చేపట్టనున్నారు.
తహసీల్దార్లు, ఎండీఓలు బాధ్యులు..
దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కార్డులకు 10,67,004 దరఖాస్తులు వస్తే..పింఛన్లకు 5,47,287 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం తో అధికారులు బెంబేలెత్తుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల సంఖ్య 11.30 లక్షలు కాగా, ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకు 10 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. మొత్తం కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అనర్హులు మినహాయించినా ఇంత మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. పింఛన్ల విషయంలో కూడా ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా అర్హులకు అన్యాయం జరిగినా..అనర్హులకు జాబితాలో చోటు దక్కినా..ఆహార భద్రత కార్డులకు సంబంధంచి తహసీల్దార్లు, పింఛన్ల విషయంలో ఎండీఓలు బాధ్యత వహించాలి. విచారణాధికారులుగా ఉండే డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ విస్తరణ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్లి స్థానికంగా ఉండే వీఆర్వోలు, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో పరిశీలన చేపడతారు.
సర్వే వివరాల ఆధారంగా...
సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ప్రజలు ఇచ్చిన వివరాల ప్రతిని ప్రస్తుతం ఇచ్చిన దరఖాస్తులకు జతచేసి అందులోని వివరాల ఆధారంగా మరోసారి పరిశీలన చేస్తామని అధికారులు చెబున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల నంబర్లను సర్వే ఫారాలపై నమోదు చేస్తారు. అదే విధంగా సర్వే ఫారాలపై ఉన్న నంబర్లును వచ్చిన దరఖాస్తులపైనమోదు చేస్తా రు. సర్వేలో సేకరించిన కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, మొత్తం భూమి, ఇంటి రకం, నాలుగు చక్రాల వాహనం...తదితర అంశాలను సరిపోల్చనున్నారు . ఎవరికెంత భూమి ఉందనే విషయాన్ని సులువుగా తె లుసుకునేందుకు 1 బీ రిజిస్టర్లను వీఆర్వోలు సిద్ధంగా ఉంచనున్నారు.
కుటుంబాల సంఖ్యపైనా ఆరా..
సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కొందరు ఒకే కుటుంబంగా ఉన్నప్పటికీ, వేర్వురుగా నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం వాళ్లు ఒకేచోట ఉంటూ వేర్వేరు కుటుంబాలు గానే దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాలను విచారణాధికారులుతమకు అందించిన పత్రంలో పొందుపర్చనున్నారు. ఎవరైనా తప్పుడు వివరాలు ఇస్తున్నట్లు అనుమానం వస్తే స్థానికులను అడిగి నిజనిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా ఒక్కో కుటుంబానికి సంబంధించిన వివరాలు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు దరఖాస్తుదారులు ఆయా పథకాలకు అర్హులా..? కాదా..? అనే విషయాన్ని తేల్చనున్నారు.
రెండు దరఖాస్తుల పరిశీలన...
ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ఒకేసారి ఉంటుంది. నవంబర్ 2 వరకు పింఛన్ల దరఖాస్తుల పరిశీలిస్తారు. విచారణాధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర అర్హత కార్డులు చూపించాలి. అప్పటికప్పుడు లేకుంటే విచారణ పూర్తయ్యే నాటికి సమర్పించాలి. లేదంటే అనర్హులుగా పరిగణిస్తారు.