‘ప్రార్థించే పెదవుల కన్నా..సేవచేసే చేతులు మిన్న’
ఈ మాటలకు పూర్తిగా సరిపోతారు నర్సులు. ఆత్మీయ పలకరింపుతో రోగులకు వారు అందించే నిస్వార్థ సేవలు ప్రశంసనీయం. నర్సింగ్ వ్యవస్థకు పురుడు పోసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఏటా మే 12న ‘ప్రపంచ నర్సుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
నర్సుల దినోత్సవ నేపథ్యమిదీ..
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ప్రమాదాల్లో గాయడిన క్షతగాత్రులను ఆప్యాయంగా ఆదరించి వారికి మానసిక ధైర్యం అందించి, గాయాలకు ప్రథమ చికిత్సలు చేయటానికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే నిస్వార్థ సేవకురాలు చేసిన కృషి ఫలితమే ‘ప్రపంచ నర్సుల దినోత్సవం’గా మారింది. వైద్యుల కన్నా నర్సులు రోగులకు సేవలందించడంలో మాన సిక ప్రశాంతతో విధులు నిర్వహించాలనేది ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆశయం. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్(ఐసీఎల్) 1965లో నర్సింగ్‌డేను గుర్తించింది. ఆ తర్వాత 1974లో యూఎస్ గవర్నమెంట్ తాత్కాలికంగా ఈ వేడుకలను ఆమోదించింది. 1999లో నర్సెస్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయూస్ యూనియన్ నర్సింగ్‌డేకు ప్రాముఖ్యతనిచ్చింది. 1974లో యూఎస్, కెనడా ఈ వేడుకలను మే 9 నుంచి 15వ తేదీ వరకు ఏటా వారోత్సవాలు నిర్వహించాలని ప్రకటించింది. నైటింగేల్ మే 12న జన్మించినందున ‘వరల్డ్ నర్సింగ్ డే’ వేడుకలు అదేరోజున నిర్వహించాలని నిర్ణరుుంచారు. అప్పటి నుంచి ఏటా మే 12న వరల్డ్ నర్సింగ్ డే నిర్వహిస్తున్నారు.
కోర్సులపై పెరుగుతున్న ఆసక్తి...
నర్సింగ్ కోర్సులపై రోజురోజుకు యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆదరణతోపాటు డిమాండ్ పెరిగింది. జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్‌డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్‌స్టిట్యూట్‌లూ పోటీ పడుతున్నాయి. నర్సింగ్ కోర్సుల్లో ఏటా సుమారు 10 వేలకుపైగా విద్యార్థులు చేరుతుండడం గమనార్హం.
నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేయాలని..
ఎన్‌ఎంఎగా సేవలందించిన మా అమ్మమ్మ మరియమ్మను చూసి నర్సింగ్‌లోకి వచ్చా. అమ్మమ్మ రోగుల సేవలో పరితపించేది. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో కష్టపడి ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేశా. ఐదు సంవత్సరాలపాటు హైదరాబాద్‌లోని న ర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు పాఠాలు బోధించా. 2011లో జాబ్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ గోదావరిఖనిలోనే. పీహెచ్‌డీ చేయాలని ఉంది. ఎలాగైనా ఎంఫీల్ పూర్తి చేస్తా. రోగులకు సేవలందించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.
- సీహెచ్.వింద్య, ఎమ్మెస్సీ నర్సింగ్
సేవ చూసి చలించిపోయా...
ఇంటర్ పూర్తి చేశాక టీచర్ కావాలని అనుకున్నా. ఆస్పత్రుల్లో సిస్టర్లు సేవలందిస్తున్న తీరు చూశాక, నాలో మార్పు తీసుకువచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక ఏం ఆలోచించకుండా నర్సింగ్ కోర్సులో చేరా. 22 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా. ఉద్యోగం చేస్తున్నా ఏనాడు రోగుల పట్ల విసుగు రాలేదు. పేషెంట్లకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.
- టి.విజయలక్ష్మి, స్టాఫ్‌నర్స్
ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్
నుంచి హెల్త్‌కు...
ఆదిలాబాద్ జిల్లాలో మొదట ఎడ్యూకేషన్ విభాగంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా ఐదేళ్లు సేవలందించా. జనరల్ నర్సింగ్ డిప్లొమా పూర్తి చేశా. 1999లో వైద్యవిధాన పరిషత్‌లో నర్సింగ్ ఉద్యోగం వచ్చింది. లేబర్ రూంలో గర్భిణులకు పురుడు పోసిసే సేవల్లో పొందిన ఆనందం మరెందులో పొందలేదు. నర్సింగ్ కోర్సుకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. నర్సింగ్ చేస్తే దేశంలో ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది.
- ఎస్.మంజూచౌదరి, స్టాఫ్‌నర్స్
నర్సులు..సేవామూర్తులు
Published Mon, May 12 2014 3:43 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement